Thursday 20 June 2013

సత్యం






పనికిరానిదంటూ  పెదవిరిచేవా   
దాని  వెనుక  సత్యమెరుగని  గుడ్డివాడివా 
చేసేది  నువ్వు  కాదు  చేయించేది  నీవు  కాదు 
కనులకున్న  పొరలు  చీల్చి  చూడలేవా
ప్రతి  పుట్టుకకున్న  విలువ  నెరగని  వెర్రి  వాడివా 
కాదేది  లోకువ  ఇలలో  ప్రతి  వస్తువైనా   
మరి  మనిషి  జన్మ  జీవనపు  తడి  తెలుసుకునేవా !!!

“Even though human life may be the most 

precious thing on earth, we always behave as if 

there were something of higher value than

human life” 

Saturday 4 May 2013

జీవిస్తోంది కేవలం జీవిస్తోంది





అనగనగా  ఒక  అమ్మాయి 
గూటిలోనే గువ్వలా పెరిగింది 
తన  ప్రపంచం  అంతా  తన  గూడే అనుకుంది 
అంతకు  మించి  లోకం  లేదనుకుంది 
రెక్కలున్నా  ఎగరడానికి  భయం  వేసింది 
విధి  తనని  ప్రపంచానికి  పరిచయం  చేసింది 
కాలం  ముందుకు  తోసింది  
ఈ అందమైన ప్రపంచాన్ని చూసింది 
జీవితాన్ని కాస్త చదివింది 
తను  నవ్వుతుందా! నవ్విస్తోందా!
తను ఆడుతుందా!  ఆడిస్తోందా!
తను  ఏడుస్తుందా! ఏడుపిస్తోందా!
ఏంచేసినా  తను  జీవిస్తోంది  కేవలం  జీవిస్తోంది 





Tuesday 16 April 2013

ఉగాది










Inline images 4


వచ్చింది  వచ్చింది  వసంత  కాలం వన్నెలు  చిలికేలా 
మోడిన  ప్రతి  కొమ్మ  ఆకుపచ్చని  రంగు  పులుముకొనగా
చిలకమ్మలు  ఊయలూగు   మామిడి  పూతలు  వయ్యారంగా 
చిగురాకుల  సాంగత్యం  చిలిపి  నేస్తమవగా 
కురిసేటి  చిరు  జల్లున  కొత్త  ఆశలు  చిగురించగా 
కోరి  కోరిన  ఆశలే  కోకిల  గొంతుకలోన  చక్కెరవగా
కొత్త  రాగాలెన్నో  నేర్చి  ప్రకృతి  సంగీతమవగా 
పూసేటి  విరుల  సొగసులు  నవ  జీవనపు  సాక్షాలుగా 
కరిగి  పోయిన  కలలకి  సరి  కొత్త  కాంతి నీయగా
పోయిన  కాలపు  చెడు  అనుభవాన్ని మరిచేలా 
చిరు  నవ్వుల  వేప  కుసుమాల  స్వచ్ఛతతో 
తెలుగింట ఉసురొలికే ఉగాది ఊసులతో 
వేసవి  విరి  గాలుల  వారధిన  ఈ  చైత్ర  ప్రయాణం  
ఆనందపు  తీరాన  అలుపెరుగక  సాగాలి  వసంతపు  వెన్నెలలా   .......










                                                Inline images 1                        మీ దీప      
                                                Inline images 1 


Friday 15 March 2013

గమ్యం







అనగనగా  రాకుమారుడు 

నీడలు  నిజాలు  తనకు 

కలిసింది  కలల  రాణి  ఎదురుగా 

చూపింది  ప్రపంచం  కొత్తగా 

విడిచి  వెళ్ళింది  ఒంటరిగా  

పరుగు  సాగింది తన రాణి  దిశగా 

లోకం  చూడమంటుంది  తనని  సూటిగా  

తనని  తను  కలుసుకున్నాడు  నిజంగా 

చేరుకున్నాడు  గమ్యాన్ని  జంటగా













మొదటి  అడుగు  వేసింది  నడక  నేర్చుటకై  కాదే   

నీ  అడుగులోని  బరువెంతో  కళ్ళు  తెరిచి  చూసేవా 

ప్రతి  అడుగు  లోని  విలువ  తెలిసి  ముందుకెల్లు మిత్రమా 

ముందడుగు  మార్గమై  చూపించును  లక్ష్యమే 

చివరి  అడుగుకైనా సిద్ధమయి  చేరుకో  గమ్యానికే 





Strong hope and determination can overcome even destiny to reach destination.




Friday 8 March 2013

నీకోసం

 

These are not my words just translated English to Telugu.

 When she walks for miles to see you.

 When she says “sorry” even though she didn't do anything wron g.

 When she cries because she still loves and misses you.

 When she still tries to get you back.

 When she no matter how much you have hurt her still loves you.

 When she stops her argument with you to save your relationship.

 When she continuously makes you feel special and tries to make you happy.

 When she is upset but does not tell you as she thinks she is annoying you.

 When she wants to leave you because of your rude behavior but she is not able to do so.




వేల  దూరాలు  నడవాలనుంది  నిను  కలిసే  ఆ  ఒక్క   క్షణం  కోసం 

తప్పు  లేకున్నా  మన్నింపు  కోరాలనుంది నీ  పెదవి  అంచున  నవ్వు  కోసం 

గుండెలోని  బాధ  కన్నీరై వస్తానంటుంది నను  చేరని  నీ  ప్రేమ  కోసం  

ప్రతి  చప్పుడు  కలవరింతై  తాకుతుంది  నీ  రాక కోసం

నువ్వు  చేసిన  గాయం  ఎదురుచూస్తుంది  నీ  చెలిమి కోసం 

నాలోని  కోపాన్ని  చెరిపివేస్తూ నన్ను  నేను  మార్చుకుంటున్నా  నీ  కోసం

ప్రతి  క్షణం  కొత్త  మార్గాలు  వెతుకుతున్నా  నీ  సంతోషం  కోసం

నిన్ను  బాధించే  నా మౌనం  నా కోపం  ఎల్లప్పుడూ  నీ  క్షేమం  కోసం

వెళ్ళాలని  లేకున్నా  దూరంగా  వెళ్తున్నా శాంతి  లేని  నీ  మనసు  కోసం



వేదం



లక్ష్య  సాధనకై  ప్రయత్నం 
ప్రేమ సాగరంలో తప్పు  కాని  అబద్దం 
అందలానికై  మాసిపోయిన వ్యక్తిత్వం 
మతం  ఆయుధంగా మారిన  వైనం 
         ఇవన్నీ
జీవితమనే  వేదాన్ని చదివినపుడు 
మట్టిలో  కలిసిపోవడానికి  కూడా  వెనుకడుగు  వేయవు 

Great achievement is usually born of great sacrifice, and is never the result of selfishness.