Saturday, 4 May 2013

జీవిస్తోంది కేవలం జీవిస్తోంది





అనగనగా  ఒక  అమ్మాయి 
గూటిలోనే గువ్వలా పెరిగింది 
తన  ప్రపంచం  అంతా  తన  గూడే అనుకుంది 
అంతకు  మించి  లోకం  లేదనుకుంది 
రెక్కలున్నా  ఎగరడానికి  భయం  వేసింది 
విధి  తనని  ప్రపంచానికి  పరిచయం  చేసింది 
కాలం  ముందుకు  తోసింది  
ఈ అందమైన ప్రపంచాన్ని చూసింది 
జీవితాన్ని కాస్త చదివింది 
తను  నవ్వుతుందా! నవ్విస్తోందా!
తను ఆడుతుందా!  ఆడిస్తోందా!
తను  ఏడుస్తుందా! ఏడుపిస్తోందా!
ఏంచేసినా  తను  జీవిస్తోంది  కేవలం  జీవిస్తోంది 





2 comments:

  1. బాగుంది.
    బ్రతకటం కన్నా జీవించటమే మిన్న!

    ReplyDelete