అనగనగా ఒక అమ్మాయి
గూటిలోనే గువ్వలా పెరిగింది
తన ప్రపంచం అంతా తన గూడే అనుకుంది
అంతకు మించి లోకం లేదనుకుంది
రెక్కలున్నా ఎగరడానికి భయం వేసింది
విధి తనని ప్రపంచానికి పరిచయం చేసింది
కాలం ముందుకు తోసింది
ఈ అందమైన ప్రపంచాన్ని చూసింది
జీవితాన్ని కాస్త చదివింది
తను నవ్వుతుందా! నవ్విస్తోందా!
తను ఆడుతుందా! ఆడిస్తోందా!
తను ఏడుస్తుందా! ఏడుపిస్తోందా!
ఏంచేసినా తను జీవిస్తోంది కేవలం జీవిస్తోంది