అనగనగా రాకుమారుడు
నీడలు నిజాలు తనకు
కలిసింది కలల రాణి ఎదురుగా
చూపింది ప్రపంచం కొత్తగా
విడిచి వెళ్ళింది ఒంటరిగా
పరుగు సాగింది తన రాణి దిశగా
లోకం చూడమంటుంది తనని సూటిగా
తనని తను కలుసుకున్నాడు నిజంగా
చేరుకున్నాడు గమ్యాన్ని జంటగా
మొదటి అడుగు వేసింది నడక నేర్చుటకై కాదే
నీ అడుగులోని బరువెంతో కళ్ళు తెరిచి చూసేవా
ప్రతి అడుగు లోని విలువ తెలిసి ముందుకెల్లు మిత్రమా
ముందడుగు మార్గమై చూపించును లక్ష్యమే
చివరి అడుగుకైనా సిద్ధమయి చేరుకో గమ్యానికే
Strong hope and determination can overcome even destiny to reach destination.