వచ్చింది వచ్చింది వసంత కాలం వన్నెలు చిలికేలా
మోడిన ప్రతి కొమ్మ ఆకుపచ్చని రంగు పులుముకొనగా
చిలకమ్మలు ఊయలూగు మామిడి పూతలు వయ్యారంగా
చిగురాకుల సాంగత్యం చిలిపి నేస్తమవగా
కురిసేటి చిరు జల్లున కొత్త ఆశలు చిగురించగా
కోరి కోరిన ఆశలే కోకిల గొంతుకలోన చక్కెరవగా
కొత్త రాగాలెన్నో నేర్చి ప్రకృతి సంగీతమవగా
పూసేటి విరుల సొగసులు నవ జీవనపు సాక్షాలుగా
కరిగి పోయిన కలలకి సరి కొత్త కాంతి నీయగా
పోయిన కాలపు చెడు అనుభవాన్ని మరిచేలా
చిరు నవ్వుల వేప కుసుమాల స్వచ్ఛతతో
తెలుగింట ఉసురొలికే ఉగాది ఊసులతో
వేసవి విరి గాలుల వారధిన ఈ చైత్ర ప్రయాణం
ఆనందపు తీరాన అలుపెరుగక సాగాలి వసంతపు వెన్నెలలా .......
మీ దీప