జరుగుతున్నది జగన్నాటకం...
జరుగుతున్నది జగన్నాటకం...
పురాతనపు పురాణ వర్ణన పైకి కనపడుతున్న కథనం
నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్ధం
జరుగుతున్నది జగన్నాటకం...
జరుగుతున్నది జగన్నాటకం...
చెలియలి కట్టను తెంచుకొని
విలయము విజ్రుంభించునని
ధర్మ మూలమే మరచిన జగతిని
యుగాంతం ఎదురై ముంచునని
సత్యవ్రతునకు సాక్ష్యాత్కరించి
సృష్టి రక్షణకు చేయూతనిచ్చి
నావగ త్రోవను చూపిన మత్స్యం
చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే
పొందగోరిన దందలేని నిరాశలో అణగారిపోతే
బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక
ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది
క్షీర సాగర మధన మర్మం
ఉనికిని నిలిపే ఇలలను కడలిలో కలుపగా ఉరికే ఉన్మాదమ్మును
కరాల్ల దంష్ట్రుల కుల్లగించి
ఈ ధరతలమును ఉద్ధరించగ
ధిరోధరితరణ హుంకారం ... ఆదివరహపు ఆకారం
ఏది ఎక్కడరా ...
నీ హరి దాకున్నా డేరా భయపడి
బయటకు రమ్మను రా ...
ఎదుటపడి నన్ను గెలువగలడా బలపడి
నువ్వు నిలిచిన ఈ నేలని అడుగు
ఈ నాడుల జీవజలమ్మును అడుగు
నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు
నీ ఊపిర్లో గాలిని అడుగు
నీ అడుగుల ఆకాశాన్నడుగు
నీలో నరుని హరినీ కలుపు
నీవే నరహరివని నువ్వు తెలుపు
ఉన్మత్త మాతంగ భంగికాతు కాకవికతి
హన్త్రు సంక్రతనీ క్రుడనీ విడనీ జగతి
అహము రథమై ఎతికే అవనికిదే అసలి నిహతి
ఆకతాయుల నిహతి అనివార్యమవు నియతి
శిత హస్తి హత మస్థ కారినక సవకాసియో ...
క్రూరాసి క్రాసి హ్రుతదాయ దంస్తుల దోసి మసి చేయ మహిత యజ్ఞం
అమేయం అనోహ్యం అమోహం అనంత విశ్వం
ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం .. ఈ మానుష రూపం
కుబ్జాక్రుతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం
ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం
జరుగుతున్నది జగన్నాటకం... జగ జగ జగ జగ జగన్నాటకం
జరుగుతున్నది జగన్నాటకం... జగ జగ జగ జగ జగన్నాటకం
పాపపు తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మగ్యానిని పెరుగక
పరశు రాముడై ... భయద భీముడై
పరశు రాముడై భయద భీముడై
ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన
శ్రోత్రియ క్షత్రియ తత్వమే భార్గవుడు
ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మశక్యము కానీ ఏ మర్మమూ లేక
మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి
మహిత చరితగ మహిని మిగలగలిగే మణికి
సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలిచి
ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా నిన్ను నీకే నూత్న పరిచితునిగా
దర్శింపజేయగల జ్ఞాన దర్పణము
క్రిష్ణావతారమే సృష్ట్యావరణ తరణము
క్రిష్ణావతారమే సృష్ట్యావరణ తరణము
అనిమదా మహిమగా గరిమగా లఖిమగా ప్రాప్తిగా
ప్రాగామ్య వర్తిగా ఈశ త్వముగా వసిత్వమ్ముగా
నీలోని అష్టసిద్ధులు నీకు తన్బట్టగా
సస్వరూపమే విశ్వరూపమ్ముగా
నరుని లోపలి పరునిపై దృష్టి పరుపగా
తలవంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే
నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే
వందే కృష్ణం జగద్గురుమ్
వందే కృష్ణం జగద్గురుమ్
కృష్ణం వందే జగద్గురుమ్
కృష్ణం వందే జగద్గురుమ్
వందే కృష్ణం జగద్గురుమ్
వందే కృష్ణం జగద్గురుమ్
కృష్ణం వందే జగద్గురుమ్
కృష్ణం వందే జగద్గురుమ్
కృష్ణం వందే జగద్గురుమ్